హోరెత్తిపోవాలి | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిపోవాలి

Mar 3 2026 7:21 AM | Updated on Mar 3 2026 7:21 AM

ఇంట్లోనూ తయారు చేసుకోవచు్చ

జాగ్రత్తలు తప్పనిసరి

మార్కెట్‌లో రంగుల విక్రయాలు

దేవాలయాల్లో డోలోత్సవాలు

రంగులతో జాగ్రత్త తప్పనిసరి

శ్రీకాకుళం కల్చరల్‌: హోలీ సమయం ఆసన్నమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండగను జరుపుకుంటారు. అయితే ఈ నెల 3న హోలీ పడినా ఆ రోజు చంద్రగ్రహణం కావడంతో హోలీని మార్వాడీలు 4న జరుపుకుంటున్నారు. కొంతమంది మంగళవారమే చేసుకుంటారు. ఈ రంగుల పండుగ ఎంతటి ఆనందదాయకమో.. అంతటి అపాయం కూడా. రంగుల ఎంపిక నుంచి ర సాయనాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసు కుని ఆ తర్వాతే సంబరం జరుపుకోవాలి.

● రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్‌లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు.

● గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు.

● పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు.

● మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు.

● గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు.

దేవాలయాల్లో వసంతోత్సవం

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాల్లో వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలను నిర్వహించనున్నారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందు రోజు కామదహనోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పడియ సందర్బంగా సముద్ర స్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, పద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామిని రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా 3వ తేదీన ఉదయం 10గంటలలోపు నిర్వహిస్తున్నారు.

మార్వాడీల హోలీ..

జిల్లా కేంద్రంలో దాదాపు 150 మార్వాడీ కుటుంబాల వారు ఉన్నారు. వీరు రాజస్థాని మిలన్‌ మంచ్‌ ఆధ్వర్యంలో హోలీ నిర్వహిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం ముందురోజు రాత్రి న్యూకాలనీలోని బాలాజీ అపార్టు మెంటు వద్ద హోలికా పూజలు చేస్తారు. అతిపెద్ద నెగడు వేసి దాని చుట్టు తిరుగుతూ పాటలు పాడతారు. ఉదయం ఎస్‌ఆర్‌ఎంటి కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు.

హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి. రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు.

ప్రమాదకరమైన రంగుల వల్ల కళ్లకు ఎలాంటి హాని జరగకుండా సన్‌ గ్లాసెస్‌ ధరించాలి. హోలీ రంగులలో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్‌ కారకాలు. హోలీ వేడుకల వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి. రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు మూసుకోవాలి. హోలీ ఆడాక గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement