బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
శ్రీకాకుళం అర్బన్: బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు అతిథిగృహంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్‌లో 40వేల సభ్యత్వం ఉందన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు వంటి సమస్యలపై పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కామ్రేడ్ టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉదయ్‌కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కమలాకర్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గమిదే..
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గిరిధర్ నాయక్, సెక్రటరీగా బి.శ్రీనివాసులు, డిప్యూటీ సెక్రటర గా కామరాజు, ఉపాధ్యక్షులుగా జి.చంద్రమౌలి, ఎం.కిరణ్, జి.రమేష్, ఏ.సూర్య, జాయింట్ సెక్రటరీలుగా కె.రామకృష్ణ, జి.గోవిందరావు, ఎస్.రవికుమార్, బి.గిరిప్రసాద్, కె.హరినాథ్, రాజు, టి.స్వప్న, ఆర్.శ్రావణి, ఎస్.రాజేష్, కోశాధికారిగా పి.ఉపేంద్ర, జాయింట్ ట్రెజరర్‌గా బి.మౌలి, కమిటీ సభ్యులుగా జి.సూర్యారావు, బి.లోహిదాసు, పి.అన్నాజీరావు, ఎం.రామ్‌ప్రసాద్, ఎ.దినమణి, డి.సంధ్యారాణి, బి.వినోద్, బి.చంద్రభూషణరావు, జె.సింహాచలం, ఎన్.రమణ, ఎం.మనోజ్, వి.మురళి, ఎం. ఎంకె. రాజు, స్నేహ తదితరులు ఎన్నికయ్యారు.


