‘సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలి’

Mar 6 2026 8:03 AM | Updated on Mar 6 2026 8:03 AM

టెక్కలి: వాహనాల తయారీలో సాంకేతిక సామర్థ్యం పెంపొందించుకోవాలని హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ బి.వెంకటేశం సూచించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ పోటీల్లో భాగంగా గురువారం వాహనాల సామర్థ్యపు తనిఖీలు నిర్వహించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు, డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ శ్రీనివాసరావు, డీన్‌ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు

జలుమూరు: డోలోత్సవం పురస్కరించుకుని శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో గురువారం ఘనంగా జరిగాయి. పార్వతీ పరమేశ్వర ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. మహిళలు, భక్తు లు స్వామికి హారతులు ఇవ్వగా వంశధార నదీతీరాన తూర్పు ముఖంగా స్వామికి చక్రతీర్థ స్నానాలు చేయించారు. తర్వాత విగ్రహాలను ఆలయంలో యథాస్థానంలో ఉంచి పూజలు చేశారు.

8న ‘అస్మిత’ మహిళా క్రీడా పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన ’అస్మిత’ పేరిట బాలికలు/మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోటీలు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలుకానున్నాయి. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మేరా యువ భారత్‌), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవ క్రీడా పోటీల్లో 13 ఏళ్ల లోపు వారు, 13–18 ఏళ్ల లోపు వారు, 18 ఏళ్లు పైబడిన మూడు వయో విభాగాల్లో బాలిక లు/మహిళలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.

ఏయే పోటీలు జరుగుతాయంటే..?

మహిళా దినోత్సవ క్రీడా పోటీల్లో 100 మీట ర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు టగ్‌ ఆఫ్‌ వార్‌ (తాడు లాగుట), ఫన్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. ఆసక్తి గల బాలికలు/మహిళలు ఎన్‌ఎస్‌ఆర్‌ఎస్‌.ఖేలోఇండియా.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి పతకాలు అందజేయనున్నారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లను అందజేస్తారు. మహిళా క్రీడా పోటీల్లో బాలికలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేరా యువ భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.వెంకట్‌ ఉజ్వల్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement