అక్రమ కేసులు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు రద్దు చేయాలి

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

అక్రమ కేసులు రద్దు చేయాలి

అక్రమ కేసులు రద్దు చేయాలి

సంతబొమ్మాళి : కాకరాపల్లి థర్మల్‌ ప్లాంట్‌కు సంబంధించి జీఓ 1108 రద్దు చేయాలని థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేట వద్ద అమరవీరుల స్మారక స్మృతిచిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ థర్మల్‌ వ్యతిరేక పోరాటంలో ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరారు. తంపరలో భవిష్యత్తులో పారిశ్రామిక పేరిట విధ్వంసక పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరావు, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ జిల్లా పోరాట కమిటీ కార్యదర్శితాండ్ర ప్రకాష్‌, అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేష్‌, ఐఎఫ్‌యూ జిల్లా నాయకులు సవలాపురపు కృష్ణవేణి, పోరాట కమిటి అధ్యక్షుడు మండపాటి నరసింగరావు, కమిటీ నాయకులు కోత మధు, మండల గన్ను గాయశ్రీ, కగ్గు జగన్నాథం, వడ్డితాండ్ర స్వదేశీ మత్య్సకార సొసైటీ ప్రెసిడెంట్‌ పద్మనాభం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement