పారిశుద్ధ్య పనుల పరిశీలన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మేధర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్, పరిసర ప్రాంతాల్లో ఆదివారం విస్త్రృతంగా పర్యటించారు. డయేరియాను పూర్తి గా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్‌తో పర్యవేక్షణ జరుగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందికి, ప్రజలకి మధ్య సమన్వయం ఉండాలనీ, వ్యర్థాలను సేకరించేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు సహకరించా లని వర్తకులను, ప్రజలను కోరారు. ఆవులు తిరిగే ప్రదేశంలో పేడ కనిపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో డయేరియా బాధితుల సంఖ్య నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. పర్యటనలో కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


