నరసన్నపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసన్నపేటలోని ఎల్‌వీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 15 కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్ ప్రతినిధులు హాజరై 257 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో అర్హత కలిగిన 99 మందిని వివిధ కంపెనీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బగ్గు అర్చన, కళాశాల కరస్పాండెంట్ ఎల్.లక్ష్మీ ప్రసన్న, ప్రిన్సిపల్ ఎం.ప్రసాదరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చంద్రమౌళి, అకడమిక్ డైరెక్టర్ జి.వి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


