ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే

ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే

మందస : నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది తప్ప నిధులు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజాశర్మ అన్నారు. హరిపురంలోని మార్పు గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో డాక్టర్‌ మట్ట ఖగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజాశర్మ మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్టు పేరిట రైతుల భూముల తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని, భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఖగేశ్వరరావు మాట్లాడుతు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వంశధార డివిజనల్‌ సాధన కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మధరావు మాట్లాడుతూ ఇచ్ఛాపురం వరకు రైతులకు సాగునీరు అందించాలని, చెరువులు, గెడ్డలు బాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో లండ బాబూరావు, హడ్డి మాస్టారు, జయరాం మల్యా, ఈశ్వరరావు, కొమరాం వాసు, ఎం.గణపతి, దిలీప్‌కుమార్‌, వడ్డీ గోపాలకృష్ణ, గణేష్‌, లక్ష్మీనారాయణ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement