
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి అవికా గోర్ (Avika Gor). 'ఆనంది' పాత్ర ద్వారా పాపులరైన అవికా తన చిరకాల ప్రియుడు, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీ (Milind Chandwani)ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.
అవికా గోర్ తన రోకా, నిశ్చితార్థాన్ని ప్రకటించినప్పటి నుండి చాలా వార్తల్లో నిలిచింది. ఇటీవల జంట 'పాటి పత్ని ఔర్ పంగా' షోలో వారి మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అవికా గౌర్ చేసిన పని ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకుంది. దీంతో అవికా గోర్ మెహందీ వేడుక వైరల్‌గా మారింది. ఈ సంప్రదాయంలో భాగంగా, అవికా తన కాబోయే భర్త మిలింద్ చాంద్వానీ పేరును తన అరచేతిపై అందంగా రాసుకుంది. అంతేకాదు తన అత్తమామల పేర్లను కూడా అదే అరచేతిలో పండించుకోవడం విశేషంగా నిలిచింది. దీనితో పాటు, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా మరొక అరచేతిలో రాయించు కుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల వైబ్స్‌లో మరింత జోష్ వచ్చింది. దీనిపై అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మిలింద్ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవంగా అభవర్ణిస్తున్నారు. అవికా అందమైన కలర్‌ఫుల్ లెహంగా, ఆభరణాల్లో కనిపించింది, మరోవైపు, మిలింద్ రాజస్థానీ శైలి తలపాగాను ధరించాడు. ఇద్దరూ ఎంతో సంతోసంగా డ్యాన్స్ చేశారు.

ప్రస్తుతం మునావర్ ఫరూఖీ అండ్ సోనాలి బింద్రే హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో,పతీ పత్ని ఔర్ పంగా-జోడియోం కా రియాలిటీ చెక్‌లో కనిపించే అవికా గోర్ ,మిలింద్ చాంద్వానీ, ఇటీవల జాతీయ టెలివిజన్ ద్వారా లైవ్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతోంది. 2019లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ ప్రక్టించచారు. సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారు.