టాలీవుడ్‌లో మరో పెళ్లి జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వచ్చే గురువారం(నవంబరు 27) పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వివాహ ఆహ్వానపత్రిక అందజేశాడు. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది.
హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్. సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్ పాడి చాలా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. రంగమార్తాండ అనే సినిమాలో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. కాలభైరవతో కలిసి రాహుల్ ఈ పాటని ఆస్కార్ స్టేజీ వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు.


