
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార‍్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.
హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్‍తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ)