
ఆ హీరోకి 63 ఏళ్లు..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు..విడాకులు అయ్యాయి. ఇప్పుడు 37 ఏళ్ల హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారట. పెళ్లంటే మాములు పెళ్లి కాదు..ఇంతవరకు ఎవరూ చేసుకొని విధంగా..అంతరిక్షంతో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. ఆ హీరో ఎవరో కాదు.. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్(Tom Cruise ). హీరోయిన్ అనాడి అర్మాస్(Ana de Armas). వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు హాలీవుడ్లో వార్తలు వచ్చాయి.
లండన్లో ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. అప్పుడే పెళ్లికి సంబంధించి పుకార్లు అయితే వచ్చాయి. భూమిపై కాకుండా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తుందట. ఒకవేళ అది కుదరపోతే గాల్లో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
‘టాక్ క్రూజ్‌కి అంతరిక్ష ప్రయాణం అంటే చాలా ఇష్టం. స్పేస్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అవకాశం వస్తే.. అంతరిక్షంలో పెళ్లి చేసుకోని చరిత్రకెక్కాలని టామ్ ఆశపడుతున్నాడు’ అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ హాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు గాలిలో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అది కుదరకపోతే అండర్‌వాటర్ వెడ్డింగ్: (సముద్రంలోకి డైవ్ అయి, అక్వారియం లాంటి సెటప్‌లో పెళ్లి చేసుకోవడం) చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సాధారణ పెళ్లి కాకుండా ‘హెడ్లైన్’లో ఉండే వివాహాన్ని చేసుకోవాలని ఇద్దరు కోరుకుంటున్నారట. మరి ఈ స్పెషల్ జంట పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి.
కాగా టామ్ క్రూజ్ ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. 1987లో మిమీ రోజర్స్‌ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. 1990లోనే నికోల్ కిడ్మన్‌ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్‌లియర్‌తో, సింగర్ చెర్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు. ఇక అనాడి ఆర్మాస్ కూడా 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్‌ని పెళ్లి చేసుకొని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత టామ్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని హాలీవుడ్ టాక్.