సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ | Rahul Sipligunj Wedding With Harinya Reddy Starts | Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: పెళ్లి పనుల్లో బిజీగా కొత్త జంట.. ఫొటోలు వైరల్

Oct 24 2025 2:11 PM | Updated on Oct 24 2025 3:04 PM

Rahul Sipligunj Wedding With Harinya Reddy Starts

అక్టోబర్ చివరకొచ్చేసింది. ఈ కొద్దిరోజుల్లోనే టాలీవుడ్‌లో పలు శుభకార్యాలు జరగబోతున్నాయి. అ‍ల్లు శిరీష్ నిశ్చితార్థం ఈనెల చివర్లో ఉండగా, నారా రోహిత్-శిరీష పెళ్లి కూడా రాబోయే కొన్నిరోజుల్లోనే జరగనుంది. మరోవైపు ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'నాటు నాటు' పాటతో ఆస్కార్ వరకు వెళ్లిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత ఫొటోలు పోస్ట్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈనెల మొదట్లో రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఇప్పుడు హరిణ్య స్వయంగా తమ పెళ్లిపనులు మొదలయ్యాయని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. లగ్నపత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ మూడు ఫొటోలని పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్, హరిణ్య జంట చూడముచ్చటగా కనిపించింది. రాహుల్‌లానే హరిణ్య కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. బిగ్‌బాస్ షోలో రాహుల్ పాల్గొన్నప్పుడే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాడు. మాస్ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కాలేజ్‌ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు ఇతడి పాడాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్‌లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే.

(ఇదీ చదవండి: నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement