
కర్ణాటక: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది.
ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్‌ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను ప్రియునితోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుని.