ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్ | Janhvi Kapoor Wedding Prediction By Astrologer | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జరిగితే ఈ ఏడాదిలో పెళ్లి.. లేదంటే మాత్రం!

Jun 16 2025 1:32 PM | Updated on Jun 16 2025 1:38 PM

Janhvi Kapoor Wedding Prediction By Astrologer

సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇ‍బ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్‌కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?

(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్‌' టీజర్‌ రిలీజ్.. భయపెట్టడమే కాదు)

Advertisement
 
Advertisement
Advertisement