నిజామాబాదు జిల్లా: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్ కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతాప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు.
ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయి తే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికి నా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.


