
స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ రియల్‌మీ తాజాగా 15టీ ఫోన్‌ను ఆవిష్కరించింది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్ల తర్వాత దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 50 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరాలు, 7000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్‌సెట్, అమోలెడ్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో సెప్టెంబర్ 6 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
రియల్‌మీ 15టీ ముఖ్య ఫీచర్లు
కెమెరా: 50ఎంపీ ఫ్రంట్ + 50ఎంపీ రియర్ (ఏఐ ఫీచర్లతో), 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్
బ్యాటరీ: 7000ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్
డిస్‌ప్లే: 6.57" అమోలెడ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0
డిజైన్: 7.79ఎంఎం స్లిమ్ బాడీ, IP66/IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
ధరలు, ఆఫర్లు
8జీబీ + 128జీబీ వేరియంట్ అసలు ధర ధర 20,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.18,999
8జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 22,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.20,999
12జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 24,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.22,999
ఈ ఫోన్‌ను "బడ్జెట్ ఐఫోన్ స్టైల్" అని కూడా పిలుస్తున్నారు.దాని డిజైన్, ఫీచర్లు చూస్తే ఆకట్టుకునేలా ఉంది.