స్టార్టప్‌లు తయారీ, డీప్‌టెక్‌పై దృష్టి పెట్టాలి: ప్రధాని | PM Modi called on India startups to focus on manufacturing AI tech | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లు తయారీ, డీప్‌టెక్‌పై దృష్టి పెట్టాలి: ప్రధాని

Jan 17 2026 11:33 AM | Updated on Jan 17 2026 11:43 AM

PM Modi called on India startups to focus on manufacturing AI tech

భారతీయ స్టార్టప్‌లు కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా తయారీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘స్టార్టప్ ఇండియా మిషన్’ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన దేశంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

గ్లోబల్ వాల్యూ చైన్‌లో భారత్ కీలకం

గడిచిన పదేళ్లలో డిజిటల్, సర్వీస్‌ రంగాల్లో భారత స్టార్టప్‌లు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ప్రధాని ప్రశంసించారు. అయితే, ఇకపై వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తయారీ రంగంలో దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. ‘కొత్త ఆలోచనలతో సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తులను స్టార్టప్‌లు రూపొందించాలి’ అని స్పష్టం చేశారు.

ఏఐ, డీప్‌టెక్‌కు పెద్దపీట

కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణల్లో నాయకత్వం వహించే దేశాలకే భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రయోజనం ఉంటుందని ప్రధాని విశ్లేషించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

  • ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించేందుకు 38,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

  • సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, భారతీయ సర్వర్లపై అభివృద్ధి చేసిన స్వదేశీ ఏఐను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

  • గతంలో పరిమితులున్న రక్షణ, అంతరిక్ష, డ్రోన్ రంగాల్లో స్టార్టప్‌ల కోసం సడలింపులు ఇచ్చామన్నారు.

మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌..

2014లో కేవలం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య నేడు రెండు లక్షలకు పైగా చేరడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగిందని, ఇందులో 125 యునికార్న్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, స్పేస్ సీడ్ ఫండ్ వంటి పథకాల ద్వారా రూ.25,000 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement