ఐటీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు, వెసులుబాటులూ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు రోజుకో కొత్త కఠిన నియమాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పూర్తిగా తొలగించాయి. ఆఫీస్కు హాజరును తప్పనిసరి చేశాయి.
దేశీ సాఫ్గ్వేర్ దిగ్గజం విప్రో.. తన హైబ్రిడ్ పని విధానాలకు మరింత పదునుపెట్టింది. కఠినమైన కార్యాలయ హాజరు నిబంధనలను ప్రవేశపెట్టింది. వారానికి మూడు రోజులు ఆఫీస్కు వస్తున్న ఉద్యోగులు ఏదో సమయంలో వచ్చి వెళ్లేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ఆఫీస్కు వచ్చిన ఉద్యోగులు కనీసం ఆరు గంటలు విధుల్లో ఉండాల్సిందే.
ఎకనామిక్ టైమ్స్ కథనం నివేదిక ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చినప్పుడు వేసే మొదటి "ఇన్" పంచ్‌కు, వెళ్లేటప్పుడు ఇచ్చే "అవుట్" పంచ్‌కు మధ్య ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఈ హాజరు సమయాన్ని సిస్టమ్ నేరుగా లీవ్స్ బ్యాలెన్స్తో అనుసంధానిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగికి వారంలో అవసమైనంత మేర హాజరు సమయం లేకపోతే వారి లీవ్స్ బ్యాలెన్స్‌లో కోత విధిస్తారు.
అయితే ఈ ఆరు గంటల వర్క్ అవర్స్ కార్యాలయంలో గడిపే సమయానికి మాత్రమే వర్తిస్తుందని విప్రో స్పష్టం చేసింది. మొత్తం రోజువారీ 9.5 పని గంటల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు.
ఇదీ చదవండి: పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్


