టెస్లా కార్లకు యాక్సిస్‌ బ్యాంక్‌ లోన్లు | Axis Bank Ties Up with Tesla as Preferred Auto Financing Partner | Sakshi
Sakshi News home page

టెస్లా కార్లకు యాక్సిస్‌ బ్యాంక్‌ లోన్లు

Mar 6 2026 3:14 PM | Updated on Mar 6 2026 3:19 PM

Axis Bank Ties Up with Tesla as Preferred Auto Financing Partner

ఎలక్ట్రిక్‌ వాహనాల దిగ్గజం టెస్లాకు ప్రిఫర్డ్‌ ఫైనాన్సర్‌గా వ్యవహరించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా టెస్లా కస్టమర్లకు ప్రత్యేక రుణ సదుపాయాలను అందించనున్నట్లు వివరించింది. ప్రధాన నగరాలు, వర్ధమాన ఈవీ హబ్‌లలో డిజిటల్‌ ఫైనాన్సింగ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ప్రీమియం ఈవీ కొనుగోలుదారుల కోసం అనువైన రీపేమెంట్‌ పథకాలు, గరిష్టంగా 10 ఏళ్ల రుణ వ్యవధి, డిజిటల్‌ ఆన్‌బోర్డింగ్‌ మొదలైన సౌకర్యాలతో రుణాలను అందించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఈడీ మునీష్‌ శర్దా తెలిపారు.

ఈ భాగస్వామ్యంతో టెస్లా వాహనాల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. కస్టమర్లు డీలర్‌షిప్‌ల వద్దే లేదా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తక్షణ రుణ ఆమోదం పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడంతో పాటు ఈవీ మార్కెట్‌ విస్తరణకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement