'కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నా నమ్మట్లేదు'.. దేవరపై నాగవంశీ కామెంట్స్‌ | Tollywood Producer Nagavamsi Comments On Devara Movie Collections | Sakshi
Sakshi News home page

Naga Vamsi: 'వారి కోసమే సినిమా కలెక్షన్స్‌'.. దేవర వసూళ్లపై నాగవంశీ కామెంట్స్

Oct 11 2024 6:39 PM | Updated on Oct 11 2024 6:46 PM

Tollywood Producer Nagavamsi Comments On Devara Movie Collections

జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్‌ చిత్రం దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే దేవర కలెక్షన్స్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఫ్యాన్స్‌ కోసమే మేము పెద్ద హీరోల సినిమాల వసూళ్లపై పోస్టర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అభిమానులు సంతోషంగా ఉంటేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నారు. తొలిరోజు కలెక్షన్స్‌ గురించి మేము చెప్పిన నంబర్లను చాలామంది నమ్మలేదన్నారు. మేము డబ్బులు వచ్చాయని చెబుతున్నా మీరు నమ్మట్లేదని అన్నారు. దేవర కలెక్షన్స్‌ నిజమేనా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారు.

నాగవంశీ మాట్లాడుతూ.. 'దేవర మిడ్‌నైట్‌ షో సినిమాకు ప్లస్‌ అయినట్టే. దేవర వల్ల నాకొక విషయం తెలిసింది. మిడ్‌నైట్‌ షోలో టాక్ ఎలా ఉన్నా.. కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. గుంటూరు కారంతోనూ అదే జరిగింది.  దేవరకు అత్యధిక గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం ఒరిజినల్‌ నంబర్స్‌ మాత్రమే ఇచ్చాం. సినిమా కలెక్షన్స్‌ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్‌ కోసమే. ఈ కల్చర్‌ హాలీవుడ్‌లోనూ ఉంది. కలెక్షన్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్ వాళ్లు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దేవర సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్‌ చేశానని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని' చెప్పారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement