అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Ajith Kumar Good Bad Ugly worldwide box office collections IN Six Days | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Collections: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Apr 16 2025 5:27 PM | Updated on Apr 16 2025 6:04 PM

Ajith Kumar Good Bad Ugly worldwide box office collections IN Six Days

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ  డ్రాగన్‌ సాధించిన లైఫ్‌ టైమ్ వసూళ్లను అధగమించిన గుడ్ బ్యాడ్ ‍అగ్లీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్‌ అగ్లీ నిలిచింది.  దేశవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే ఆరు రోజుల్లో రూ.108.30 కోట్ల నెట్‌ వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద  రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో మెప్పించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్ విలన్‌ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement