రజినీకాంత్ వేట్టయాన్‌.. నాలుగు రోజుల్లోనే రికార్డ్! | Super Star Rajinikanth Vettaiyan worldwide box office on Day 4 | Sakshi
Sakshi News home page

Vettaiyan Collections: రజినీకాంత్ వేట్టయాన్‌.. నాలుగు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?

Oct 14 2024 7:41 PM | Updated on Oct 14 2024 8:09 PM

Super Star Rajinikanth Vettaiyan worldwide box office on Day 4

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.

విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్‌, కబాలి, జైలర్‌, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాయి. 

కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement