వీక్‌ డేస్‌లోనూ తగ్గేదేలే.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Prabhas Kalki 2898 AD Movie Day 6 World Wide Box Office Collections Details Inside | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Collections: బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Jul 3 2024 4:13 PM | Updated on Jul 3 2024 4:35 PM

Prabhas kalki 2898 AD Collections World Wide On Day 6

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంంబోలో వచ్చిన‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరున లిఖించుకుంది. మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

తాజాగా కల్కి ఆరు రోజుల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంగళవారం ఒక్కరోజే రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో  రూ.700 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో పలు రికార్డులు సృష్టించిన కల్కి.. మరికొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement