కాంతార చాప్టర్-1.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా! | Kantara Chapter 1 is world highest grossing film in this week | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1: కాంతార చాప్టర్-1.. ఏకంగా హాలీవుడ్ సినిమాలనే దాటేసింది!

Oct 9 2025 4:50 PM | Updated on Oct 9 2025 6:37 PM

Kantara Chapter 1 is world highest grossing film in this week

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతార రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా హాలీవుడ్‌ సినిమాలనే అధిగమించింది. 

ఈ వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతారా చాప్టర్ -1 నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా రెండు హాలీవుడ్‌ చిత్రాలను అధిగమించింది. టేలర్ స్విఫ్ట్ సినిమా పార్టీ ఆఫ్‌ ఏ షో గర్ల్, లియోనార్డో డికాప్రియో నటించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్'  చిత్రాల వసూళ్లను దాటేసింది. కాంతార చాప్టర్-1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ మొదటి వారంలో దాదాపు 53 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో 50 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన టేలర్ స్విఫ్ట్ చిత్రం పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్‌ను దాటేసింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాను కూడా కాంతార చాప్టర్-1 బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇటీవలే రీ రిలీజ్‌ అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ కూడా కాంతార కంటే వెనకే ఉంది.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ..379 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.451 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో  బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ (రూ.431 కోట్లు), 3 ఇడియట్స్ (రూ.450 కోట్లు) వంటి సూపర్ హిట్‌ సినిమాల జీవితకాల కలెక్షన్స్‌ అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

రిషబ్ శెట్టి  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement