
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కాంతార చాప్టర్-1(Kantara Chapter 1). పాన్ ఇండియా హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
(ఇది చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్)
అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఫుల్గా ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రీక్వెల్ మూవీ కోసం ఇప్పటికే బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. కాంతార ప్రీక్వెల్ను దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్లోనూ రిలీజ్ కానుంది. అంతే కాకుండా దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో.. ఇప్పుడు ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి పోస్ట్ ప్రొడక్షన్‌పనుల్లో బిజీగా ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు.