కేజీఎఫ్‌ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Rishab Shetty Kantara Chapter 1 Box Office Collection Day 4 | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1 Collections: కేజీఎఫ్ రికార్డ్‌ బ్రేక్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Oct 6 2025 3:25 PM | Updated on Oct 6 2025 4:24 PM

Rishab Shetty Kantara Chapter 1 Box Office Collection Day 4

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్‌ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.  తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్‌ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్‌ త్వరలోనే అధిగమించనుంది.

కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్‌ టైమ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement