గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Rishab Shetty's Kantara: Chapter 1 Box Office Collections On Day 3 | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1 Collections: కాంతార చాప్టర్-1 కలెక్షన్స్.. గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్!

Oct 5 2025 3:56 PM | Updated on Oct 5 2025 6:46 PM

Rishab Shetty's Kantara: Chapter 1 Box Office Collections On Day 3

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్బస్టర్హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా మూవీని తెరకెక్కించారు. ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్ను అధిగమించింది. అంతేకాకుండా ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్కలెక్షన్స్ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement