
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్గా హిట్గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.
Goosebumps
Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025