ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే! | Top 10 Indian movies with highest worldwide box office collections | Sakshi
Sakshi News home page

Top 10 Indian movies: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!

Jun 21 2025 4:07 PM | Updated on Jun 21 2025 6:08 PM

Top 10 Indian movies with highest worldwide box office collections

ఇండియన్‌ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ‍త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ ‍అవార్డ్‌ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్‌-10 చిత్రాలేవో చూసేయండి.

ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్‌ దంగల్‌ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్‌, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్‌తో సమానంగా సౌత్‌ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.

ప్రపంచవ్యాప్తంగా దంగల్‌ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్‌లో ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్‌-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.


ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు



 

Advertisement
 
Advertisement
Advertisement