
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది.
తాజాగా మరో రికార్డ్‌ను కాంతార చాప్టర్-1 తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..
కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
The divine roar echoes across oceans! 🌊#KantaraChapter1 emerges as 2025’s Highest-Grossing Indian Film in Australia 🇦🇺❤️🔥#BlockbusterKantara running successfully in cinemas near you ✨#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms… pic.twitter.com/658jFJTaQz
— Hombale Films (@hombalefilms) October 20, 2025