కల్కి ఖాతాలో మరో మైలురాయి.. ఆ మార్కును దాటేసింది! | Prabhas Nag Ashwin Kalki Movie Hits Another Record In Collections | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: నెల రోజులైనా తగ్గేదేలే.. ఆ మార్కును దాటేసింది!

Jul 25 2024 5:19 PM | Updated on Jul 25 2024 6:22 PM

Prabhas Nag Ashwin Kalki Movie Hits Another Record In Collections

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్‌ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఓవర్‌సీస్‌లోనూ అత్యధిక వసూళ్లతో సత్తా చాటింది. విడుదలైన రెండువారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.

తాజాగా కల్కి మూవీ మరో రికార్డ్‌ సృష్టించింది. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్‌ ట్విటర్‌ ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్‌ అంటూ కల్కి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో మెరిశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement