కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్‌ కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే? | Kollywood Star Hero Vijay GOAT box office collection On day 3 | Sakshi
Sakshi News home page

The Goat Movie: ది గోట్‌ కలెక్షన్స్‌.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!

Sep 8 2024 10:00 AM | Updated on Sep 8 2024 12:54 PM

Kollywood Star Hero Vijay GOAT box office collection On day 3

కోలీవుడ్ స్టార్‌ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన ది గోట్‌ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్‌, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్‌ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో  నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement