తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Jr NTR Movie Devara Collections In 10 Days Of Its Release | Sakshi
Sakshi News home page

Devara: బాక్సాఫీస్ వద్ద దేవర జోరు.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Oct 7 2024 12:23 PM | Updated on Oct 7 2024 12:29 PM

Jr NTR Movie Devara Collections In 10 Days Of Its Release

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్‌ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్‌ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.
మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో ‍త్వరలోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయనుంది.

కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
Advertisement