'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్! | Director Ram Gopal Varma Tweet On Allu Arjun Pushpa 2 Movie Over Box Office Collections, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: 'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్!

Dec 8 2024 6:43 PM | Updated on Dec 9 2024 12:16 PM

Director Ram Gopal Varma Tweet On Allu Arjun Pushpa 2 Movie

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్ప-2 సినిమాపై సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు లేని రికార్డులు సృష్టిస్తోందని పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ క్రియేట్ చేస్తోన్న రికార్డులపై ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. హిందీలో ‍ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రావడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఆర్జీవీ తన ట్వీట్‌లో రాస్తూ.. 'హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రం ‍‍అత్యధిక వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది.. అలాగే బాలీవుడ్‌ యాక్టర్‌ కాకుండా మన అల్లు అర్జున్‌ అక్కడ బిగ్గెస్ట్‌ స్టార్‌గా నిలిచారు.. పుష్ప-2 పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మీరు స్టైలే వేరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ సత్తా అంటే ఇది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

కాగా.. సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలిరోజే రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టిన పుష్పరాజ్.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు సాధించింది. దీంతో హిందీలో బన్నీ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement