రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.
కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్-2 తర్వాత ఈ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా (రూ.807 కోట్లు) రికార్డ్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలిచిందన్నారు. తమిళనాడులోనూ 3వ అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ఘనత సొంతం చేసుకుంది.
ఇంగ్లీష్‌లోనూ కాంతార చాప్టర్-1
ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్‌లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.
#KantaraChapter1 is now the Highest Grossing Indian Film of 2025.. 🔥
Joining the elite league after #KGF2…#KantaraChapter1 becomes only the 2nd dubbed film to storm past ₹100 Cr in Telugu States!
3rd highest Dubbed film in TN..
And its worldwide roar now crosses… pic.twitter.com/gCzgfUL8l9— Ramesh Bala (@rameshlaus) October 24, 2025


