
రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాహుబలి ది బిగినింగ్ ఆల్‌టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది.
ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్‌ను సాధించడం విశేషం.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు.