వావ్.. సూపర్‌.. 72 గంటలు కూడా ఆడని సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌! | The Kerala Story director Sudipto Sen slams Laapataa Ladies Filmfare award | Sakshi
Sakshi News home page

Film Fare Awards: లపత్తా లేడీస్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌.. ఆ విషయంలో మాకు ఫుల్ హ్యాపీ!

Oct 14 2025 5:44 PM | Updated on Oct 14 2025 7:02 PM

The Kerala Story director Sudipto Sen slams Laapataa Ladies Filmfare award

ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చిన్న సినిమా లపత్తా లేడీస్‌ అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ ఏకంగా 12 విభాగాల్లో ‍అవార్డ్స్‌ దక్కించుకుంది. ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శలు చేశారు. గతేడాది రిలీజైన సినిమాలైన'ఐ వాంట్‌ టు టాక్‌' చిత్రానికి అభిషేక్‌ బచ్చన్‌, 'చందు: ఛాంపియన్‌' సినిమాకు కార్తీక్‌ ఆర్యన్‌ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్‌ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. 2023లో వచ్చిన లాపతా లేడీస్‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

అయితే లపత్తా లేడీస్‌క ఏకంగా 12 అవార్డులు రావడంపై ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శించారు. 2024లో వచ్చిన మంచి చిత్రాలకు గుర్తింపు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ, భారతీయ చిత్ర పరిశ్రమపై దాని ప్రభావంపై సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

సుదీప్తో సేన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ చూస్తే కొత్త ధోరణి బయటపడింది. కేవలం 72 గంటలకు పైగా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేని.. కాపీరైట్‌ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రం లపత్తా లేడీస్. అందరూ ఊహించినట్లుగానే 2024లో అత్యుత్తమ సినిమా ఏదనేది ఇంకా క్లారిటీ రాలేదు. ది కేరళ స్టోరీ జాతీయ అవార్డులను అందుకోవడానికి వ్యతిరేకంగా ఫిల్మ్‌ఫేర్ ఎందుకు అంతలా గొంతు విప్పిందో నాకిప్పుడు అర్థమైంది. ఈ ఉడ్(పరోక్షంగా బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఉద్దేశించి) సమాజం మమ్మల్ని గుర్తించకపోవడం.. ఆహ్వానించకపోవడంపై నేను చాలా సంతోషంగా ఉన్నా" అని అన్నారు.

అంతే కాకుండా ఫేక్ నవ్వులు  ముఖ్యంగా ఫేక్ పొగడ్తల నుంచి మేము తప్పించుకున్నామని సుదీప్తో సేన్ రాసుకొచ్చారు. ముంబయిలో సినిమా పేరుతో ఈ తమాషాలు.. కేన్స్‌లో సెల్ఫీలు తీసుకోకుండా మమ్మల్ని రక్షించనందుకు చాలా సంతోషంగా ఉన్నానని పోస్ట్ చేశారు. ఏదేమైనా సినిమా పేరుతో చేసే మోసం, నకిలీ వస్త్రధారణ నుంచి మేము బయటపడ్డామని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

ముఖ్యంగా మీడియా, సినిమా జర్నలిజం ఉన్నప్పుడు.. ఏ భారతీయ సినిమా సంస్థ నుంచి గొప్పగా ఆశించనని సుదీప్తో సేన్ స్పష్టం చేశారు. ఎందుకంటే గొప్ప గ్లామర్, సంపన్నమైన స్టార్స్‌కే ప్రపంచం గుర్తిస్తుందన్నారు. గ్రామాలు, చిన్న నగరాల నుంచి వచ్చే ప్రజలు మిస్టర్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ఇంటి ముందు గుమిగూడే విధానమే ఇలాంటి సరైన ఉదాహరణ అని బాలీవుడ్‌పై విమర్శలు చేశారు.


కాగా.. గత నెలలోనే సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన  'ది కేరళ స్టోరీ' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.  ఈ సినిమాను కేరళ యువతులను ఇస్లాం మతంలోకి మార్చడంపై ‍రియల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. ‍అయితే జాతీయస్థాయిలో సత్తా చాటిన ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ నుంచి ఎలాంటి అవార్డ్స్, ప్రశంసలు రాలేదు. దీంతో డైరెక్టర్ సుదీప్తో సేన్ తనదైన శైలిలో విమర్శించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement