
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
ఇండియాలో నెట్ కలెక్షన్స్..
1వ రోజు: రూ.65 కోట్లు
2వ రోజు: రూ.54.75 కోట్లు
3వ రోజు: రూ.39.5 కోట్లు
4వ రోజు: రూ.35 కోట్లు
మొత్తం: రూ.194.25 కోట్లు
#Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs..
This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025