పుష్ప -2 క్రేజ్‌.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్‌ బ్రేక్! | Pushpa 2 The Rule worldwide box office collections In Just 11 Days | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 కలెక్షన్స్‌.. 11 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Dec 16 2024 6:38 PM | Updated on Dec 16 2024 7:05 PM

Pushpa 2 The Rule worldwide box office collections In Just 11 Days

బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.

సుకుమార్‌- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్‌ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్‌లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ‍

(ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్‌' సాంగ్‌ వీడియో విడుదల)

కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్‌ బ్రేక్..

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్‌ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement