శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్‌టైమ్ వసూళ్లు! | Nagarjuna Akkineni Shiva Re-Release Collections in Two days | Sakshi
Sakshi News home page

Shiva Re-Release Collections: శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్‌టైమ్ వసూళ్లు!

Nov 16 2025 3:52 PM | Updated on Nov 16 2025 4:04 PM

Nagarjuna Akkineni Shiva Re-Release Collections in Two days

నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ మూవీ శివ. తెలుగు సినీ ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఈ చిత్రమిది. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీతోనే రాం గోపాల్ వర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ కల్ట్ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.

ఈ మూవీని తాజాగా 4కె వర్షన్‌లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 14న వచ్చిన ఈ చిత్రం కోసం నాగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త 4కె వర్షన్‌లో రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పట్లోనే రూ.4 కోట్లు రాబట్టిన శివ.. రీ రిలీజ్‌లోనూ సత్తా చాటడం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్‌ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement