'నేను అలా చేసుంటే.. పెద్దిని డ్యామేజ్ చేశావ్ అనేవారు' | Tollywood Producer Naga Vamshi Comments about Peddi MOvie | Sakshi
Sakshi News home page

Naga Vamshi: 'నేను అలా చేసుంటే.. పెద్దిని డ్యామేజ్ చేశావ్ అనేవారు'

Jul 7 2026 6:30 PM | Updated on Jul 7 2026 8:43 PM

Tollywood Producer Naga Vamshi Comments about Peddi MOvie

టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తుతం లెనిన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అఖిల్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన తమిళ మూవీ బ్లాస్ట్. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా, ప్రీతి ముకుందన్‌, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. అయితే తెలుగులో ఈ మూవీని నాగవంశీ విడుదల చేశారు. బ్లాస్ట్ మూవీని ప్రమోట్‌ చేయలేకపోవడానికి  గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు తగిన సమయం దొరలేదన్నారు.

బ్లాస్ట్ టైమ్‌లోనే సరిగ్గా పెద్ది థియేటర్లలో విడుదలైందని నాగవంశీ తెలిపారు. ఆ టైమ్‌లో నేను బ్లాస్ట్ ప్రమోషన్‌ చేస్తే.. కావాలనే చేశాననే అంటారు. ఒకవేళ పెద్ది రిలీజైన తర్వాత మొదలు పెడితే.. సినిమాను డ్యామేజ్‌ చేయడానికి మైక్‌ పట్టుకున్నావా అని అంటారని చెప్పారు. అంతేకాకుండా పెద్ది నిర్మాత సతీశ్‌ కిలారు నాకు స్నేహితుడని వెల్లడించారు. ఒకవేళ బ్లాస్ట్ రెండు వారాల ముందు వచ్చి ఉంటే మరింత డబ్బులు వచ్చేవని తెలిపారు. రామ్‌చరణ్‌తోనూ సినిమా తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. కానీ కుదరడం లేదని నాగవంశీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement