దురంధర్‌కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది? | No support for Ram Charan Peddi Movie From Tollywood side | Sakshi
Sakshi News home page

Peddi Movie: దురంధర్‌కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది?

Jun 7 2026 8:32 PM | Updated on Jun 7 2026 8:39 PM

No support for Ram Charan Peddi Movie From Tollywood side

ప్రస్తుతం థియేటర్లలో రామ్ చరణ్ పెద్ది మూవీ సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ ‍అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. తనయుడి టాలెంట్‌ను చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారంటూ పొగిడారు.

అయితే పెద్దికి మాత్రం టాలీవుడ్ హీరోల నుంచి సపోర్ట్ కరువైంది. కేవలం చిరంజీవి, కొందరు మెగా హీరోలు మాత్రమే రివ్యూలు ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్స్‌ వీక్షించి మరి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మిగిలిన స్టార్‌ హీరోల నుంచి మాత్రం పెద్దికి ఎలాంటి మద్దతు రావడం లేదు. రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌పై ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించిన తెలుగు హీరోలు.. పెద్ది విషయానికి వచ్చేసరికి గప్‌చుప్‌ అయిపోయారు.

 పెద్ది సినిమాపై ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్స్‌ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ అభిప్రాయాలను పంచుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇప్పటి వరకు పెద్దిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. దురంధర్‌ సినిమాను సపోర్ట్ చేసిన మన హీరోలు.. టాలీవుడ్ మూవీని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. ఇకనైనా మన హీరోలు.. మన సినిమాలకు మద్దతుగా నిలుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement