మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.
పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.


