పెద్ది మూవీ.. ఇప్పుడు చేస్తే ఏం లాభం? | Peddi Movie makers Decision on Ticket Price In Single screen Theatres | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది మూవీ.. ఇప్పుడు తగ్గిస్తే ఏం లాభం?

Jul 1 2026 7:40 PM | Updated on Jul 1 2026 7:47 PM

Peddi Movie makers Decision on Ticket Price In Single screen Theatres

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన పెద్ది బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచడంతో వసూళ్లపరంగా పెద్దికి బాగానే కలిసొచ్చింది. అయితే రెండు వారాల తర్వాత లీడ్‌ రోల్లో వచ్చిన చిత్రం మా ఇంటి బంగారం థియేటర్లలో రిలీజైంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా సమంత మూవీకి క్యూ కట్టారు. సామ్ మూవీకి హిట్ టాక్ రావడంతో పెద్ది వసూళ్లు పడిపోయాయి. మూడో వారం నుంచే పెద్ది కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. సమంత మూవీ ఎఫెక్ట్ పెద్ది వసూళ్లపై పడింది.

ఈ నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ది మూవీ టికెట్ ధరలను తగ్గించారు. నైజాంలో ప్రస్తుతం ఒక్కో టికెట్ ధర రూ.105, రూ.80, రూ.50గా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సగటు అభిమానులు మండిపడుతున్నారు. మూవీ రిలీజైన నెల రోజులకు టికెట్ రేట్స్ తగ్గిస్తే లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. రెండో వీకెండ్ తర్వాత  టికెట్ ధరలు తగ్గించి ఉంటే ఫలితం ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పెద్ది విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తోంది. అందువల్లే థియేటర్లకు జనాలు రావడం కూడా కష్టంగా మారిపోయింది. ఎలాగో ఓటీటీకి వస్తుంది కదా సగటు ప్రేక్షకుడు భావిస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు తగ్గించినా ఎలాంటి ఫలితం లేదనే అభిప్రాయం ‍వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల తర్వాత పెద్ది వసూళ్లు పెరగకపోవడానికి కారణం అధిక టికెట్ ధరలేనని చెబుతున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement