రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈ మూవీ పేరుతో ఏకంగా స్కూల్ ఉందని మీకు తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో స్కూల్‌ను చూసిన ఓ చిన్నారి ది పెద్ది స్కూల్.. నాన్న అది చికిరి చికిరి వాళ్ల స్కూలా అంటూ క్యూట్‌గా.. అమాయకంగా అడిగింది. ఈ వీడియో యూఎస్‌లో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో పెద్ది టీమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
#ChikiriChikiri Vala School Ah Anta 🔥😂#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/LDYLZLZTXQ
— SAI CHARANISM ™ 🔥 (@saicharanism1) June 8, 2026


