రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే? | Ram Charan Peddi Movie Collections in Just Seven Days | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Jun 11 2026 3:38 PM | Updated on Jun 11 2026 3:52 PM

Ram Charan Peddi Movie Collections in Just Seven Days

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ మెప్పించింది.

ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement