'నా బాడీ గార్డ్‌ను బయటికెళ్లకుండా చేశారు'.. రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్ | Ram Charan breaks silence on his bodyguard Kevin Kunta sudden fame | Sakshi
Sakshi News home page

Ram Charan: 'అతన్ని మీరే ఫేమస్ చేశారు.. ఇక బయటికి పంపను'

Jun 4 2026 7:31 PM | Updated on Jun 4 2026 7:52 PM

Ram Charan breaks silence on his bodyguard Kevin Kunta sudden fame

తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది.

‍అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్‌లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్‌లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్‌కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.

ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్‌ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. 

వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నారు.  కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement