మీ అభిమానం సల్లగుండా.. పెద్ది కోసం రూ.2 లక్షల ఖర్చు..! | Japan Fans Came To Hyderabad And Spend ₹2 Lakh To Watch Ram Charan Peddi Movie, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది క్రేజ్‌.. రూ.2 లక్షల ఖర్చుతో ఇండియాకు..!

Jun 3 2026 4:05 PM | Updated on Jun 3 2026 4:42 PM

Japan Fans Came to Hyderabad To Watch Ram Charan Peddi Movie

రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా పెద్ది మానియా కనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్‌లో పెద్ది దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మూవీపై క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

ఈ సినిమాకు ఫ్యాన్స్‌ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ ఉన్నారు. పెద్ది కోసం ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఇద్దరు జపనీస్ మహిళ అభిమానులు భాగ్యనగరానికి చేరుకున్నారు. పెద్దిని చూసేందుకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు చేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.  వీరిద్దరు పెద్ది సినిమాను 3 రోజుల్లో 10 సార్లు చూడాలన్నదే ఆశయమని చెబుతున్నారు. తెలుగు భాష రాకపోయినా కేవలం అభిమానంలో జపాన్ నుంచి ఇండియాకు రావడమంటే మాటలు కాదు. ఇది చూసిన కొందరు ఖరీదైన అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది.

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement