పెద్దిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఏమన్నారంటే? | sandeep Reddy Vanga Review In ram Charan Peddi Movie | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్దిపై యానిమల్ డైరెక్టర్ రివ్యూ.. ఏమన్నారంటే?

Jun 4 2026 3:54 PM | Updated on Jun 4 2026 4:06 PM

sandeep Reddy Vanga Review In ram Charan Peddi Movie

టాలీవుడ్‌లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ‍మూవీని డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.

తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో వీక్షించిన సందీప్‌ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్‌ నుంచి బయటికి వస్తున్న సందీప్‌ను అక్కడే ఉన్న కొందరు ‍అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ ‍టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement