ది రాజాసాబ్‌, పెద్ది రికార్డ్స్ బ్రేక్.. బన్నీ క్రేజ్‌ చూశారా? | Allu Arjun Happy Re-Release Storms Kerala Box Office, Beats Prabhas And Ram Charan Films | Sakshi
Sakshi News home page

Allu Arjun: ది రాజాసాబ్‌, పెద్ది రికార్డ్స్ బ్రేక్.. బన్నీ క్రేజ్‌ చూశారా?

Jun 17 2026 9:16 AM | Updated on Jun 17 2026 11:46 AM

Allu Arjun Happy Movie Re Release Record at kerala box office

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో ‍అల్లు ‍అర్జున్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప సినిమాల తర్వాత బన్నీ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా బన్నీకి టాలీవుడ్‌ తర్వాత అత్యధిక ఫ్యాన్స్‌ ఉన్నది మలయాళంలోనే. కేరళలో అల్లు అర్జున్‌ అంటే తమ సొంతవాడిలా భావిస్తారు. ఆయనను ముద్దుగా మల్లు అర్జున్‌ అని కూడా పిలుస్తారు.  అంతలా మలయాళీల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు.

తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన హ్యాపీ మూవీ రీ రిలీజ్ చేశారు. 4కె వర్షన్‌లో ఈ సినిమా విడుదల చేయగా కేరళలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.1.10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇది చూస్తుంటే కేరళలో బన్నీ క్రేజ్‌ ఏంటో అర్థమైపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్‌ సినిమాల రికార్డులను హ్యాపీ మూవీ దాటేసింది.

గతేడాది రిలీజైన ది రాజాసాబ్ మూవీ కేరళ వసూళ్లను హ్యాపీ అధిగమించింది. మలయాళంలో ప్రభాస్ ది రాజాసాబ్‌ కేవలం రూ.23 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. రీ రిలీజ్‌లోనూ అల్లు అర్జున్ మూవీ రికార్డ్ సృష్టించడం విశేషం. అదే క్రమంలో రామ్ చరణ్ పెద్ది కేరళ వసూళ్లను సైతం హ్యాపీ మూవీ దాటేసింది. పెద్ది మూవీ కేరళ వ్యాప్తంగా కేవలం రూ.72 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ది రాజాసాబ్, పెద్ది మూవీస్ సాధించలేని రికార్డులను బన్నీ రీ రిలీజ్‌ మూవీతోనే కొట్టేశాడు. ఇది చూసిన ‍అభిమానులు అల్లు అర్జున్ మరోసారి తన స్టామినాను నిరూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement